ఆదివారం, 23 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 నవంబరు 2025 (16:35 IST)

సినిమా వాళ్లు ఏమన్నా సంసారులా? ఐ బొమ్మ రవి దమ్మున్నోడు: తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్ (video)

Teenmar Mallanna
ఐబొమ్మ రవి దమ్మున్నోడు అంటూ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు... ఐబొమ్మ రవి భార్య హింట్ ఇస్తేనే సీపీ సజ్జనార్ ఐబొమ్మ రవిని పట్టుకున్నారు లేదంటే పోలీసుల ఆల్సేషియన్ కుక్కలు కూడా అతడిని పట్టుకునేవి కావు. వంద రూపాయల టిక్కెట్టును వేలల్లో అమ్ముకునే సినిమా వాళ్లు ఏమన్నా సంసారులా? పోలీసులకు సవాల్ విసిరితే ఏమవుతుందోనని సినిమా వాళ్లను పక్కన పెట్టుకుని సినిమా డైలాగులు కొట్టడం మానుకోవాలి. సజ్జనార్ ఇకనైనా రియాల్టీకి రావాలి, నువ్వు చేసేవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్లే. దమ్ముంటే సైబర్ క్రైంలను ఆపు. సైబర్ క్రైమ్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. వాటిని ఆపండి సజ్జనార్ గారూ అంటూ తీన్మార్ మల్లన్న ఓ వీడియోలో సవాల్ విసిరారు.
 
సీపీ సజ్జనార్ పైన తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పోలీసు వ్యవస్థను కించపరిచేవిధంగా చేసిన వ్యాఖ్యలను తీన్మార్ మల్లన్న వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు మరికొందరు తీన్మార్ మల్లన్న పోలీసులపై చేసిన వ్యాఖ్యలు తప్పే కానీ సినిమా వాళ్లపై చేసినవి మాత్రం నూటికి నూరు శాతం కరెక్ట్ అంటున్నారు. మరి మీరు ఏమంటారు?