శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (14:08 IST)

గణేష్ నిమజ్జనం ట్యాంక్ బండ్‌లో కుదరదు, ఎందుకంటే?

Ganesh
హైదరాబాదు నగరంలో గణేష్ నిమజ్జనం అంటే అదో భారీ వేడుక. నగరంలో 9 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు నిర్వహించిన అనంతరం భక్తులు గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసేవారు. ఐతే గణేష్ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవి కావడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నట్లు తేలింది.
 
దీనితో ట్యాంక్ బండ్‌లో గణేష్ నిమజ్జనం జరుపకూడదని హైకోర్టు ఆదేశించడంతో ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. దీనిపై నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ... నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ లో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 18 వేల మంది పోలీసులు పాల్గొంటారని ఆయన తెలిపారు.