1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (21:58 IST)

ఇంటర్ పరీక్షలు సరిగ్గా రాయలేదు.. సారీ డాడీ.. భవనంపై నుంచి దూకేసింది..

victim woman
ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేదని.. తనను డాక్టర్ చేయాలన్న తండ్రి కోరికను నెరవేర్చలేకపోతున్నానని అందుకే సూసైడ్ చేసుకుంటానని.. ఓ విద్యార్థిని హనుమకొండలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హనుమకొండ జిల్లా భీమారంలో పండగపూట విషాదం నెలకొంది. 
 
వివరాల్లోకి వెళితే.. శివానీ జూనియర్ కాలేజీలో బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు శాయంపేట మండలం కనపర్తి గ్రామానికి చెందిన సాహిత్య (16)గా గుర్తించారు. సాహిత్య కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకేసినట్లు కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. 
 
కూతురి మృతిపై సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటినా ఘటన స్థలంకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే, తన కూతురి మరణంపై సాహిత్య తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
కూతురి మరణం వెనుక ఉన్న అసలు కారణం తెలియాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.