ఆదివారం, 7 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 డిశెంబరు 2025 (09:46 IST)

పవన్ కళ్యాణ్ వివాదంపై నాలుక మడతేసిన మంత్రి వెంకట్ రెడ్డి

komati vs pawan
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెనక్కి తగ్గి, నాలుక మడతేసి యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సుకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించేందుకు విజయవాడకు మంత్రి కోమటిరెడ్డి వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాను పవన్ కళ్యాణ్‌ను విమర్శించలేదంటూ సారీ చెప్పారు. పైగా, అది మంచి పద్దతి కాదన్నారు. చిన్న చిన్న విషయాలు జరుగుతుండాయి. పోతుంటాయి వాటిపై నో కామెంట్స్‌ అంటూ పవన్‌తో ఉన్న వివాదానికి ఆయన ముగింపు పలికారు.
 
కాగా, ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ వివాదంపై మాట్లాడుతూ, పవన్ చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పాలని లేనిపక్షంలో పవన్ సినిమాలు తెలంగాణాలో ఆడనివ్వబోమని హెచ్చరించారు. పవన్ వెంటనే సారీ చెప్తే తెలంగాణాలో ఆయన సినిమా కనీసం ఒకటి రెండు రోజులైనా ఆడుతాయి. లేకపోతే, తెలంగాణాలో ఆయన సినిమాలు ఆడనివ్వం అంటూ ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా వెంకట్ రెడ్డి హెచ్చరించిన విషయం తెల్సిందే.
 
కాగా, ఇటీవల పవన్ కోనసీన జిల్లా పర్యటనలో మాట్లాడుతూ, కోనసీమ పచ్చదనానికి నరదిష్టి తగిలిందని, అందుకే పచ్చని కొబ్బరి చెట్లు ఇలా ఎండిపోయాయని, ముఖ్యంగా, తెలంగాణ నేతల దిష్టేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా పవన్‌పై విమర్శలు గుప్పించారు. వీరిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు.