1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 15 మే 2024 (12:34 IST)

జనసేన ఎందుకు, మోడీ భజనసేన అని పెట్టుకో: పవన్ పైన కేటీఆర్ సెటైర్లు

ktrao
జనసేన అనే పార్టీ పెట్టడం ఎందుకు, ఏకంగా మోడీ భజనసేన అని పేరు మార్చుకుని ప్రధానమంత్రికి భజన చేస్తే సరిపోతుంది కదా అంటూ భారాస నాయకుడు కేటీఆర్ పవన్ కల్యాణ్ పైన సెటైర్లు వేసారు. జనసేన అనే పార్టీ పెట్టి అన్ని సీట్లలో పోటీ చేయరంట. గెలిస్తే మాత్రం కారణం వారంట, ఓడిపోతే మాత్రం కారణం వారు కాదంట.
 
అసలు జనసేన అనే పార్టీ ఎందుకు, మోడీ భజన చేస్తున్న మీరు ఆ పార్టీని మోడీ భజనసేన అని పెట్టుకుంటే బాగుంటుంది కదా. పార్టీ పెట్టాక ప్రజల్లోకి వెళ్లండి, మీ సత్తా ఏమిటో తెలిసిపోతుంది అంటూ కేటీఆర్ అన్నారు. మరి ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా పవన్ కల్యాణ్ పైన కేటీఆర్ విరుచుకుపడ్డారు. కారణం ఏంటో?