సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (16:21 IST)

శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో 14 మంది విద్యార్థులకు కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా వ్యాపిస్తోంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని నార్శింగిలో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో 14 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. దీంతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 
 
గత రెండు రోజులుగా చలి, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు కోవిడ్ టెస్టులు చేయగా, వారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. 
 
ఈ విషయం తెలిసిన నార్సింగి మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. కాలేజీ మొత్తాన్ని శానిటైజ్ చేశారు. మిగిలిన విద్యార్థులను కూడా హోం ఐసోలేషన్‌కు తరలించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో వచ్చిన వేరియంట్‌ను నిర్ధారణ చేసేందుకు వారి శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు.