Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మద్యంలో నీళ్లకు బదులు యాసిడ్ కలుపుకుని తాగిన యువకుడు...

Written By సందీప్
Updated: బుధవారం, 30 జనవరి 2019 (16:54 IST)
ఓ యువకుడు మంచినీళ్లనుకుని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని త్రాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్‌రావు అందించిన సమాచారం ప్రకారం, కుమ్మరివాడికి చెందిన గణపతిస్వామికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడైన విజయ్‌కుమార్(26) ఆటోని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 
 
ఆదివారం సాయంత్రం మద్యం సీసాతో ఇంటికి వచ్చిన విజయ్ మిద్దె పైకి వెళ్లాడు, అక్కడ బాత్‌రూమ్ కిటికీపై ఉన్న యాసిడ్ బాటిల్‌ని నీళ్ల సీసాగా భావించి మద్యంలో కలుపుకుని తాగాడు. కొద్దిసేపటికి గొంతులో మంట పుట్టడంతో యాసిడ్‌గా గుర్తించాడు, గట్టిగా కేకలు పెట్టాడు.
 
ఇంట్లో ఉన్న తండ్రి అప్రమత్తమై హుటాహుటిన స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. విజయ్‌కుమార్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments