సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎఎం వాసుదేవన్
Last Modified: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (13:20 IST)

అమ్మాయి ఫోన్ చేస్తే వెళ్లి బుక్కయ్యాడు...

ఆకతాయిలు అమ్మాయిలకు ఫోన్‌లు చేసి ఏడిపించడం పరిపాటిగా మారుతున్న ఈ రోజులలో తనను నిత్యం వేధిస్తున్నాడని ఒక యువకుడిని చితికిబాదించిన ఒక యువతిని పోలీసులు అరెస్ట్ చేయడం ఇక్కడ విశేషం. 
 
వివరాలలోకి వెళ్తే... మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రోగ్రామింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. అయితే ఆమెని సాయికిరణ్‌ అనే యువకుడు ఫోన్‌లో వేధించేవాడు. విసిగిపోయిన ఆమె అతడిని గురువారంనాడు సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ కళాశాల వద్దకు పిలిపించింది. సాయి అక్కడికి వెళ్లగానే ఆమెతోపాటు మరో ఐదుగురు యువకులు మూకుమ్మడిగా అతనిపై దాడిచేసి, గాయపరిచి పారిపోయారు. 
 
గాయపడిన అతడిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని చికిత్స పొందుతున్న సాయికిరణ్‌ నుంచి వివరాలు సేకరించి దాడికి పాల్పడిన యువతిని అదుపులోకి తీసుకొని మరో ఐదుగురు పరారీలో ఉన్నారనీ.. వారినీ త్వరలోనే పట్టుకుంటామని తెలియజేసారు.