గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (19:13 IST)

14న తెలంగాణా పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

bandi sanjay
కేంద్రహోం శాఖామంత్రి అమిత్ షా ఈ నెల 14వ తేదీ శనివారం తెలంగాణా రాష్ట్రానికి వస్తున్నారు. ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను శనివారంతో ముగించనున్నారు. ఈ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన తెలంగాణాకు వస్తున్నారు. 
 
ఇప్పటికే తొలి విడత యాత్రన పాలమూరులో ముగించగా, ఆ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చిన విషయం తెల్సిందే. 
 
ఇపుడు రెండో దశ ప్రచార యాత్ర ముగింపు కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతున్నారు. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుక్కుగూడలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. ఇందులో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకోసం తెలంగాణ బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.