మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (16:37 IST)

బాసరలో ట్రిబుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

deadbody
తెలంగాణ రాష్ట్రం, బాసరలో ఉన్న ట్రిబుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సురేష్‌గా గుర్తించారు. హాస్టల్‌లోని తన గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. డిచ్ పల్లికి చెందిన సురేష్‌గా గుర్తించారు. 
 
అయితే, ఈ విద్యార్థి ఓ యువతిని ప్రేమిస్తూ వచ్చాడని, ఈ ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్య చేసుకునివుంటాడని సహచర విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఉరివేసుకున్న స్థితిలో సురేష్‌ను గుర్తించిన సహచర విద్యార్థులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు వెల్లడించారు. ఈ విద్యార్థి ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.