సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: శనివారం, 24 అక్టోబరు 2020 (16:44 IST)

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు: మెగాస్టార్ చిరంజీవి

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలకు ఎంతో విశిష్టత వుంది. తెలంగాణ ఆడపపడుచులు అంబరాన్ని అంటే ఆనందంతో సంబరాలు జరుపుకునే బతుకమ్మ పండుగ నేటితో ముగియనున్నాయి. తొమ్మిద రోజులు వివిధ పేర్లతో గౌరమ్మ వైభవాన్ని పూజించిన తెలంగాణ మహిళలు చివరి రోజు సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు.
 
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ బతుకమ్మ సంబరాలను వైభవోత్సవంగా జరుపుకుంటున్న ఆడపడపచులందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే సందర్బమిది కనుక మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆనందంతో ఉండాలని మెగాస్టార్ ట్వీట్ శారు.
 
మరోవైపు టీఆర్ఎస్ నాయకురాలు కవిత ఓ వీడియో పోస్ట్ చేశారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి గౌరమ్మను ఆరాధించే బతుకమ్మసందర్భంగా తెలంగాణా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు.