బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (19:51 IST)

హైదరాబాద్ చందానగర్‌లో దారుణం-మ్యాథ్స్ సబ్జెక్ట్‌ ఇష్టం లేదు..

suicide
హైదరాబాద్ చందానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆరో తరగతి బాలిక ఆత్మహత్య చేసుకుంది. మ్యాథ్స్ సబ్జెక్ట్‌ ఇష్టం లేదంటూ చిన్నారి బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తోంది.