ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

నేడు మంచిర్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన.. కలెక్టరేట్ భవనం ప్రారంభం

cmkcr
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మంచిర్యాలలో పర్యటించనున్నారు. ఈ జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం నస్పూర్ చేరుకొని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. 
 
ఈ సందర్భంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం కులవృత్తులు చేసుకునే అర్హులైన లబ్ధిదారులకు రూ.లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. కలెక్టర్లు ఎంపిక చేసిన లబ్ధిదారులకు తొలి రోజే రూ.లక్ష చెక్కులను సీఎం అందించనున్నారు. అలానే 'గృహాలక్ష్మి' పథకం, దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 
 
ఈ సందర్భంగా నస్పూరులో ఏర్పాటు చేసే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. మహారాష్ట్ర 288 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విస్తరణ తెలంగాణ మోడల్ పాలనను అందించడమే లక్ష్యంగా మహారాష్ట్రలో 288 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.