1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (17:46 IST)

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణ పనులు ముంగిపు దశలో ఉన్నాయి. ఈ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఆలయ పునః సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆయన అధికారులు, వేద పండితులతో చర్చించనున్నారు. 
 
అంతేకాకుండా, మార్చి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయన పునఃప్రారంభోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించనుంది. 
 
ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి అతిథులు, పీఠాధిపతులు, యోగులు, స్వామీజీలు, భారీగా తరలి వచ్చే భక్తుల కోసం కల్పించాల్సిన సౌకర్యాలు, తదితర ఏర్పాట్లపై ప్రభుత్వ అధికారులతో చర్చించనున్నారు.