ఆదివారం, 3 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (14:40 IST)

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. బైరి నరేశ్ అరెస్ట్

ayyappa swamy
అయ్యప్ప స్వామిపై బైరి నరేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్పస్వాములు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసి కఠింనంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అయ్యప్ప జన్మ వృత్తాంతం, భక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వరంగల్ జిల్లాకు చెందిన బైరి నరేశ్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని వరంగల్ లో అదుపులోకి తీసుకున్నారు. 
 
హిందువుల మనోభావాలను కించపరిచిన నరేష్ పై కొందరు అయ్యప్ప స్వాములు దాడి చేశారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి  కోరారు. అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.