ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (21:32 IST)

తెలంగాణలో మాస్కులు తప్పనిసరి.. వైద్యశాఖ కీలక నిర్ణయం

కరోనా మూడో వేవ్ నెమ్మదించడం, కేసులు తగ్గుతుండటంతో తెలంగాణ వైద్య శాఖ కీలక విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాస్క్ నిబంధనల గురించి మాట్లాడారు.
 
60 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలున్నవాళ్ల తప్ప మిగతా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం 'వ్యక్తిగత విషయం' అని అన్నారు. ముఖ్యంగా మాల్స్‌, మార్కెట్‌ల వంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ నిబంధనలను పాటించకపోతే అధికారులు జరిమానా కూడా విధిస్తున్నారని హెల్త్ డైరెక్టర్ గుర్తు చేశారు. 
 
రాష్ట్రంలో కోవిడ్ అదుపులోకి వచ్చిందని, ప్రతిరోజూ 30-40 కేసులు మాత్రమే నమోదవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిందని విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు, మాస్క్‌లు ధరించడం మంచిదని జి శ్రీనివాసరావు అన్నారు.