శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (08:34 IST)

ఆదిలాబాద్‌లో ఘోరం - కంటైనర్‌ను ఢీకొన్న కారు - నలుగురి మృతి

road accident
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళుతున్న కారు నియంత్రణ కోల్పోయి కంటైనర్‌ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సీతాగొంది వద్ద జరిగింది. 
 
ఈ ఘటనలో కారులోని నలుగురు ప్రమాదస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహళ ఉన్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతులను ఆదిలాబాద్ వాసులుగా గుర్తిచారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.