హైదరాబాద్‌లో దంచి కొడుతున్న భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో మంగళవారం వర్షం దంచికొడుతోంది. స్థానిక వాతావరణ కేంద్రం హెచ్చరించిన మేరకు ఈ నెల 8వ తేదీ వరకు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇందులోభాగంగా, మంగళవారం మధ్యాహ్నం నుంచి భాగ్యనగరిలో వర్షం దంచికొడుతోంది.
ముఖ్యంగా, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్, హైదర్ నగర్, రాంనగర్, అంబర్ పేట్, ప్యాట్నీ సెంటర్, బంజారాహిల్స్, ఆల్విన్ కాలనీ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఎల్బీ నగర్, మలక్ పేట, సికింద్రాబాదు, లక్డీకాపూల్, కూకట్ పల్లి, అమీర్ పేట, వనస్థలిపురం, బోయిన్ పల్లి, బేగంపేట, పంజాగుట్ట, సోమాజిగూడ, ఓయూ, నిజాంపేట, చిలకలగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదుకాగా, కొన్ని ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి.
మరోవైపు, ఈ వర్షం ప్రారంభమైన కొద్దిసేపటికే అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎప్పటిలాగే రహదారులపై నీళ్లు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వాహనదారులు రోడ్లపై ఇబ్బందులు పడుతున్నారు.