1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (09:34 IST)

పట్టిస్తే రూ.పది లక్షలు, తెలంగాణ పోలీసుల ప్రకటన: హీరో నాని ఏమన్నాడంటే?

తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీని కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. కాగా, దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆర్టీసీ ఉద్యోగులను అలర్ట్‌ చేశారు.
 
ఇప్పటికే బస్టాండ్‌, బస్సుల్లో నిందితుడి ఆనవాళ్లు ఉన్న పోస్టర్లను అతికించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే నిందితుడిపై పోలీసు శాఖ రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.  
 
ఇదిలావుంటే, సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడి సీసీ టీవీ దృశ్యాలు లభించాయి. నిందితుడు రాజు కోసం వంద మంది పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. 
 
ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బీనగర్ వద్ద మరో స్నేహితుడితో కలిసి మద్యం తాగాడు. ఆ తర్వాత బయటకు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఎల్బీనగర్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే రాజు స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు రాజు చేసిన నేరం తెలియదన్నాడు. మద్యం తాగిన తర్వాత రాజు ఎటు వెళ్లాడో తనకు తెలియదని చెప్పాడు.
 
గతంలో నిందితుడు రాజుపై బైక్ దొంగతనం కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి ప్రవర్తన నచ్చక భార్య వదిలేసి వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. నల్గొండ జిల్లాలో ఉన్న రాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.