బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 21 ఆగస్టు 2021 (12:02 IST)

వివేకా హ‌త్య స‌మాచారం అందిస్తే, రూ.5 ల‌క్ష‌ల బ‌హుమానం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సమాచారం ఇవ్వాలంటూ సిబిఐ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి ఐదు లక్షల రూపాయ‌ల‌ బహుమానాన్ని ప్రకటించింది.

ప్రజల వద్ద ఈ హత్యకు సంబంధించిన సమాచారం ఉంటే, తమకు తెలియజేయాలని పత్రికాముఖంగా సిబిఐ కోరింది. ఇప్పటికే వివేకా హ‌త్య కేసులో పలువురు అనుమానితుల‌ను సిబిఐ విచారించింది. నలుగురి వద్ద పలు ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. ఇపుడు మ‌రింత సమాచారం సేకరణలో సిబిఐ నిమగ్నమైంది.

వివేకా హ‌త్య కేసులో త‌మ‌కు తెలిసిన కీల‌క సమాచారం, సాక్ష్యాలు అందించాలి అనుకున్న వ్యక్తులు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి అయిన డిఎస్.పి దీపక్ గౌర్ ఫోన్ నెంబర్ - 94742569749 కు కాల్ చేసి స‌మాచారం అందించ‌వ‌చ్చు. అలాగే, ఈ కేసులో సిబిఐ పర్యవేక్షణ అధికారి అయిన ఎస్పి రామ్ సింగ్ ఫోన్ నెంబర్ 998827270 కు కాల్ చేయ‌చ్చు.

సాక్షుల‌కు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని, ఈ నెంబర్లకు ద్వారా వివరాలు అందించాలని సిబిఐ అధికారులు కోరుతున్నారు.