మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 18 ఆగస్టు 2021 (13:31 IST)

పంజ‌రంలో బంధించిన చిల‌క సీబీఐ! స్వ‌యంప్ర‌తిప‌త్తి ఏది?

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఉద్దేశించి మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పంజరంలో బధించపడిన చిలక అని.. కేంద్రం ఎన్నికల కమిషన్‌, కాగ్‌ మాదిరి దానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని సూచించింది.

ఈ క్రమంలో సీబీఐకి అధిక అధికారాలు, అధికారంతో కూడిన చట్టబద్ధమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని పరిగణలోకి తీసుకుని, అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉండే భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాలి. అప్పుడే ప్రజలకు సీబీఐ మీద విశ్వాసం పెరుగుతుంది’ అని వ్యాఖ్యానించింది.

సిబిఐ చేప‌ట్టిన ప్ర‌తి కేసు కేంద్రం క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తుంటాయ‌ని మొద‌టి నుంచి అప‌వాదు ఉంది. ప‌లు ప్ర‌తిష్ఠాత్మ‌క కేసుల్లో సిబిఐ ఇలాంటి అప‌వాదుల‌నే ఎదుర్కొంది. ఏ ప్ర‌భుత్వం కేంద్రంలో ఉంటే, దానికి అనుకూలంగా న‌డుస్తుంటార‌నే విమర్శ‌ల నేప‌థ్యంలో మ‌ద్రాసు హైకోర్టు వ్యాఖ్య‌లు ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్నాయి.