సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (17:23 IST)

హైదరాబాదులో పెరిగిన అల్ట్రా రిచ్ వ్యక్తుల సంఖ్య.. కోటీశ్వరులు..?

దేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో నగరంగా హైదరాబాద్ నిలిచింది. అంతేగాకుండా హైదరాబాదులో అల్ట్రా రిచ్ వ్యక్తుల సంఖ్య 2016లో 314 నుంచి 2021లో 467కు పెరిగింది. 
 
నైట్ ఫ్రాంక్ యొక్క వెల్త్ రిపోర్ట్ 2022 ప్రకారం, ముంబైలో 1596 అల్ట్రా-హై నికర విలువ కలిగిన వ్యక్తులు (యుహెచ్ ఎన్ డబ్ల్యుఐ) ఉన్నారు. 
 
హైదరాబాద్ విషయానికి వస్తే, యుహెచ్ ఎన్ డబ్ల్యుఐ సంఖ్య 2016 లో 314 నుండి 2021లో 467 కు పెరిగింది. హైదరాబాదులో భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే, అంటే పూణే, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ, చెన్నై,అహ్మదాబాద్ కంటే ఎక్కువ మంది యుహెచ్ ఎన్ డబ్ల్యుఐలు ఉన్నారు.
 
2026లో యుహెచ్ ఎన్ డబ్ల్యుఐ సంఖ్యను కూడా నివేదిక అంచనా వేసింది. దీనిప్రకారం హైదరాబాద్ రెండవ అత్యధిక సంపన్న జనాభాకు నిలయంగా కొనసాగుతుంది. కోటీశ్వరుల విషయంలో ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో సగానికంటే తక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలో వేగంగా కుబేరులు వృద్ధి చెందుతున్నట్లు సర్వే గుర్తించింది