బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (15:55 IST)

హైదరాబాదుకు మరో అత్యున్నత స్థాయి గౌరవం

charminar
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదుకు మరో అత్యున్నత స్థాయి గౌరవం లభించనుంది. హైదరాబాద్‌ మహానగరంలో సైన్స్‌ సిటీ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి పంపారు. కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సైన్స్‌ మ్యూజియాల జాతీయ మండలి దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగా హైదరాబాద్‌ మహానగరంలో సైన్స్‌ సిటీని ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వివరాల్ని తెలంగాణ ప్రభుత్వానికి పంపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంకా భూమి కూడా కేటాయించాల్సి వుంటుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్రం కేంద్రానికి పంపిన అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.