బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (16:39 IST)

ప్రియుడి సుఖం కోసమే బూస్ట్‌లో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేశా : జ్యోతి

ప్రియుడు ద్వారా శారీరకసుఖం పొందేందుకే కట్టుకున్న భర్తకు బూస్ట్‌లో నిద్రమాత్రలు కలిపి చంపేసినట్టు భర్త హత్య కేసులో ప్రధాన నిందితురాలైన భార్య జ్యోతి తెలిపింది. తనకు పెళ్లికాకముందు నుంచే కార్తీక్‌తో వివా

ప్రియుడు ద్వారా శారీరకసుఖం పొందేందుకే కట్టుకున్న భర్తకు బూస్ట్‌లో నిద్రమాత్రలు కలిపి చంపేసినట్టు భర్త హత్య కేసులో ప్రధాన నిందితురాలైన భార్య జ్యోతి తెలిపింది. తనకు పెళ్లికాకముందు నుంచే కార్తీక్‌తో వివాహేతర సంబంధం ఉందనీ, ఆ సంబంధాన్ని తెంచుకోలేక పెళ్లయిన తర్వాత కూడా కొనసాగించినట్టు తెలిపారు. అయితే, జీవితాంతం తన ప్రియుడితోనే ఉండాలన్న ఏకైక కారణంతో కట్టుకున్న భర్తను చంపేసినట్టు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. 
 
వారంక్రితం చోటుచేసుకున్న హైదరాబాద్‌ నాచారానికి చెందిన కమ్మరి నాగరాజు(40) అనే కార్పెంటర్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో అతడి భార్య జ్యోతి(20) ప్రధాన నిందితురాలుకాగా, ఆమె ప్రియుడు మహాంకాళి కార్తీక్‌ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత జ్యోతి వద్ద పోలీసులు జరిపిన విచారణలో భర్తను ఏ విధంగా హత్య చేసిందో పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. 
 
తనకు పెళ్లికి ముందే నాచారానికే చెందిన కార్తీక్‌ అనే వ్యక్తి పరిచయం ఉందని, ఇది ప్రేమగా మారి, శారీరక సంబంధానికి దారితీసిందన్నారు. పెళ్లి జరిగాక కొన్ని రోజులు సంబంధాలు లేకుండా ఉన్నాయన్నారు. కానీ, 2 నెలల క్రితం కార్తీక్‌ సెల్‌ నంబరును తెలుసుకుని మళ్లీ సంబంధం కొనసాగించినట్టు చెప్పింది. 
 
అయితే, కార్తీక్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు తన భర్త నాగరాజును అడ్డు తొలగించుకోవాలని భావించినట్టు తెలిపింది. తమ పథకంలో భాగంగా, గత నెల 30న రాత్రి భోజనం చేసిన తర్వాత భర్తకు బూస్ట్‌లో మత్తు మాత్రలు కలిపి ఇచ్చినట్టు చెప్పింది. ఆ తర్వాత మృతదేహాన్ని కార్తీక్‌, అతని స్నేహితులైన బిస్మిల్లా ఖాన్‌(నాచారం), నదియాల్‌ గౌరవ్‌ (నాచారం), సిర్రప్ప నరేశ్‌ (లాలాపేట)ను తీసుకొని కారులో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం అంకిరెడ్డి గూడెం శివారులో పడేసినట్టు వివరించింది.