శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (09:05 IST)

రేపు ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమవుతుందని ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.

టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు ఈ శోభాయాత్ర చేరుకుంటుందని చెప్పారు. అనంతరం గణేశుడి నిమజ్జనం ఉంటుందని పేర్కొన్నారు. 
 
భక్తుల విజ్ఞప్తి మేరకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని పిలుపునిచ్చారు. శోభాయాత్రకు పోలీసులు సహకరించాలని కోరారు. 
 
ఖైరతాబాద్ గణేశుడి ఊరేగింపునకు పోలీసు బందోబస్తు ఇవ్వకపోయినా, ప్రైవేటు సెక్యూరిటీ‌తోనైనా శోభాయాత్ర నిర్వహిస్తామని ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు స్పష్టంచేశారు.
 
హిందువుల పట్ల పక్షపాత ధోరణి: బండి సంజయ్  
ఖైరతాబాద్ మహాగణపతిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నగర ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, ఇతర నాయకులు దర్శనం చేసుకోవడం జరిగినది. బండి సంజయ్ మాట్లాడుతూ.. నవరాత్రులు ఎంతో సంతోషంగా ఉల్లాసంగా చేసుకోవాలని కోరారు. 

రాష్ట్రప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని, హిందువుల పట్ల పక్షపాత ధోరణితో ఉందని, నిమజ్జన ఏర్పాట్లను కూడా పక్షపాత ధోరణితో  ఏర్పాటు చేయడం చాలా దురదృష్టకరమని  విమర్శించారు.