సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:01 IST)

కోరుట్లలో దారుణం : వ్యక్తిని గొంతుకోసి హత్య

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఆలకుంట చిన్నలక్ష్మయ్య (48) అనే వ్యక్తి శనివారం అర్థరాత్రి హత్యకు గురయ్యాడు. గ్రామ పంచాయతీ భవనం ఫిల్లర్‌కు కట్టేసి గొంతుకోసి హతమార్చినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 
 
అర్థరాత్రి భార్యాభర్తలకు గొడవ జరగడంతో లక్ష్మయ్య తన అత్తపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. భార్యాభర్తల నడుమ కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని అదనపు ఎస్సీ సురేశ్‌ కుమార్‌, డీఎస్పీ గౌస్‌బాబా పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.