మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2020 (10:58 IST)

హాస్యనటుడు బ్రహ్మానందం స్కెచ్-బాపు బొమ్మ అదుర్స్

Brahmanandam
కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన హాస్యనటుడు బ్రహ్మానందం తనలోని చిత్రకళకు పదును పెట్టారు. చిత్రలేఖనంలో తనకున్న ప్రావీణ్యాన్ని చాటుతూ ఈ మధ్య వరుసగా చిత్రాలు గీస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత బాపు స్కెచ్‌ను అద్భుతంగా గీసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
బ్రహ్మానందం తన కామెడీతో నవ్వించడమే కాకుండా చిత్ర లేఖనంతోను అలరిస్తున్నారు. గతంలో ప్రేమతో రాముడిని ఆలింగనం చేసుకున్న హనుమంతుడు ఆనందబాష్పాలు కారుస్తున్నట్లుగా ఓ పెన్సిల్ స్కెచ్‌ వేశారు. అలానే లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేయొచ్చనే భావాన్ని స్ఫురించేలా ఓ చిత్రాన్ని గీశారు. శ్రీశ్రీ బొమ్మని కూడా అచ్చు గుద్దినట్టు వేశారు. బ్రహ్మానందం స్కెచ్‌లకు అభిమానలు ముగ్ధులవుతున్నారు.