ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (08:04 IST)

వైద్య సిబ్బంది నెల రోజులు సెలవులు రద్దు: మంత్రి ఈటల

ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరగడం వల్ల వైద్య సిబ్బందికి నెలరోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. సూర్యాపేటలో జిల్లా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. తక్షణ వైద్యం అందించడంతో పాటు రోగులకు ధైర్యం చెప్పాల్సిన గురుతర బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గుర్తు చేశారు.

సూర్యాపేట జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన... రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరగడం వల్ల వైద్య సిబ్బందికి నెలరోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య విద్యార్థులతో మాట్లాడిన మంత్రి... వృత్తి పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు.

అనంతరం విరేచనాల విరుగుడుకు తీసుకొచ్చిన రోటా వాక్సిన్​ను... చిన్నారులకు అందించారు. ఈటలతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నారు.