మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (18:31 IST)

వృద్ధ మహిళను ఒడిలో కూర్చోబెట్టుకుని... మంత్రి మల్లారెడ్డి..?

Malla Reddy
Malla Reddy
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
18వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బిఆర్ఎస్ లో చేరారు. వారందరికీ మల్లారెడ్డి స్వాగతం పలికారు. 
 
ఈ నేపథ్యంలో గౌరమ్మ అనే వృద్ధ మహిళను చంటి పిల్లలా తన ఒడిలో కూర్చోబెట్టుకుని, తనకు ఓటు వేయాలని అడిగారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు.