ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (21:30 IST)

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మళ్లీ నుమాయిష్

హైదరాబాదులో నుమాయిష్ నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతోంది. కరోనా థర్డ్‌ వేవ్‌ విజృంభించడం ద్వారా ఈసారి ఎగ్జిబిషన్ ప్రారంభమైనా.. ప్రభుత్వ కఠిన ఆంక్షల కారణంగా నిలిపివేయాల్సి వచ్చింది. 
 
ప్రస్తుతం తెలంగాణ సర్కారు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన కారణంగా మళ్లీ ఎగ్జిబిషన్‌ను పునఃప్రారంభించేందుకు సిద్ధం అయ్యింది.
 
ఈనెల 25 నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ పునఃప్రారంభం అవుతుందని ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రకటించింది. కాగా, జనవరి 1వ తేదీన ప్రారంభమైన నుమాయిష్.. కోవిడ్‌ ఆంక్షల కారణంగా జనవరి 3వ తేదీ నుంచి మూసివేశారు. 
 
ఇప్పుడు కరోనా ఆంక్షలు తొలిగించడంతో మళ్లీ నుమాయిష్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నుమాయిష్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.