శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (07:56 IST)

5న హైదరాబాద్‌ సిటీకి రానున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న శ్రీరామానుజచార్య సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. ఈ సందర్భంగా 11వ శతాబ్దానికి చెందిన శ్రీ రామానుజాచార్యను గౌరవించే 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' పేరుతో ప్రతిష్టించిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. 
 
ప్రభుత్వ వర్గాల ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ తొలుత పటాన్‌చెరులోని ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) క్యాంపస్‌ను సందర్శిస్తారు, అక్కడ ఆయన ఇనిస్టిట్యూట్ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు.
 
ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌కు వెళ్లి 216 అడుగుల ఎత్తైన శ్రీరామానుజ చార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ప్రాంగణంలో ప్రధాని మోజీ కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్‌లు నిర్మించారు. అలాగే, ప్రధాని రాక సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీకి తిరిగి వెళతారు.