ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: శనివారం, 15 మే 2021 (16:13 IST)

జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవద్దు: సీఎం కేసీఆర్ ఆదేశాలు

పోలీసులు, జర్నలిస్టులకు మధ్య గొడవలు జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని ఇరువురి మధ్య గొడవలు మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హితవు పలికారు. కొవిడ్ లాక్ డౌన్ సందర్భంగా మీడియాకు ప్రభుత్వం పూర్తి అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. వారిని అడ్డుకుంటే ప్రజలకు ఎలాంటి సమాచారం లభించదని తెలిపారు.

చివరకు తాను ఏం మాట్లాడినా కూడా ప్రజల్లోకి వార్తలు వెళ్లే పరిస్థితి ఉండదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర డిజిపి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు శాఖను ఆదేశించాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రభుత్వమే వారికి అనుమతి ఇచ్చిందని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వారిని అడ్డుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించవద్దని ఆదేశించారు. ఇందులో ఎవరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాల్సిన అవసరం మీడియాకు ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.