ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (11:41 IST)

సాగుకు విద్యుత్ కోతలు... క్లారిటీ ఇచ్చిన ట్రాన్స్‌కో ఎండీ

power supply
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఈ కోతల ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఉన్నాయి. 
 
అయితే, వ్యవసాయానికి మూడు ఫేజుల విద్యుత్ సలఫరాలోనూ కోతలు విధిస్తున్నారు. దీంతో తెలంగాణా ప్రాంతంలోని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గురువారం అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 
 
ఇక రాత్రిపూట సింగిల్ ఫేజ్ విద్యుత్ మాత్రమే సరఫరా చేయనున్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. గురువారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. 
 
ఎన్.పి.డి.సి.ఎల్ సంస్థలో నిన్న కొంత సమాచారం లోపంతో వ్యవసాయ రంగ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. దీన్ని సరిచేసి శుక్రవారం నుంచి విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించినట్టు చెప్పారు. ఇప్పటివరకు ఎలా విద్యుత్ సరఫరా చేశామో ఇకపై కూడా అదేవిధంగా సరఫరా చేస్తామన్నారు.