సింగరేణిలో కొలువుల జాతర : 372 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణా రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల్లో కొలువుల జాతర మొదలైంది. ఏకంగా 372 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. సింగరేణిలో 651 పోస్టులను మార్చిలోపల భర్తీచేస్తామని సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రకటించిన రెండు వారాల్లోనే మొదటివిడుత భర్తీకి నోటిఫికేషన్ రావడం గమనార్హం. మిగతా పోస్టులకు దశలవారీగా నోటిఫికేషన్లను విడుదలచేస్తామన్నారు.
కాగా, తొలి దశ నోటిపికేషన్‌లో 7 క్యాటగిరీల్లో 372 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో 305 పోస్టులను లోకల్.. అంటే సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మానికి చెందిన అభ్యర్థులకు కేటాయించారు.
అన్‌రిజర్వ్‌డ్ విభాగంలో 67 పోస్టులు కేటాయించారు. అంటే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలవారు ఈ పోస్టులకు పోటీపడొచ్చు. పూర్తి సమాచారం కోసం www. scclmines. com ను సంప్రదించాలి. అర్హులైన అభ్యర్థులు శుక్రవారం మధ్యా హ్నం 3 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయం త్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సంస్థ తెలిపింది.
దరఖాస్తుతోపాటు అర్హతల సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని పేర్కొంన్నది. ఎవరూ హార్డ్‌కాపీలను పంపించవద్దని స్పష్టంచేసింది. దరఖాస్తు సమయంలోనే ఎస్బీఐ లింకు ద్వారా రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ఉద్యోగాలకు గరిష్టం వయోపరిమితి 30 యేళ్లుగా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు మినహాయింపునిచ్చారు.
దీనిైప సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పందిస్తూ, ఉద్యోగాల నియామకం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని యువతకు సువర్ణ అవకాశమన్నారు. రాత పరీక్ష ద్వారానే ఎంపిక ఉంటుందని, ఇంటర్వ్యూలు ఉండవన్నారు. ముఖ్యంగా, పైరవీలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే నమ్మవద్దన్నారు. ఎవరైనా ప్రలోభపెడితే సింగరేణి విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయాలని కోరారు.