గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (18:44 IST)

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్

cmkcr
తెలంగాణ రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. గురువారం నుంచి రుణమాఫీ చేయనున్నట్టు వెల్లడించారు. రుణమాఫీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతు రుణమాఫీపై ప్రగతి భవన్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావులతో పాటు ఇతర అధికారులతో ఆయన ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఇటీవల ప్రకటించిన రైతు రుణమాఫీపై చర్చించారు. 
 
ముఖ్యంగా, గత 2018 ఎన్నికల సందర్భంగా రూ.లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, కొంతమేర రుణాలు మాఫీ చేశామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. కరోనా లాంటి ఉపద్రవంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఆర్థిక వెసులుబాటు లేక రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఆర్థిక పరిస్థితి కుదుట పడినందున రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.