1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (18:20 IST)

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. అలా జరగడం..?

తెలంగాణ సీఎం కేసీఆర్.. టి. కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రగతిభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరియమ్మ లాకప్‌ డెత్‌‌ ఇష్యూను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరియమ్మ లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. 
 
అలాగే, ఏపీతో నెలకొన్న జల జగడంపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టీకాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. అపాయింట్‌మెంట్ అయితే, టీకాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. 
 
కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక టీకాంగ్రెస్‌ నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ లీడర్లు గతంలో ఎన్నోసార్లు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ అవకాశమివ్వలేదు. పైగా అసెంబ్లీలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తులను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ, ఇప్పుడు వున్నట్టుండి సీఎల్పీ బృందానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.