మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (13:58 IST)

మీకో న్యాయం.. పేద వారికి ఓ న్యాయమా కేసీఆర్ దొరా : వైఎస్.షర్మిల

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా రోగాన్ని ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చలేదని ఆమె మరోమారు ప్రశ్నించారు. పేద వాళ్ళను తెలంగాణ సర్కారు ఆదుకోవడం లేదని విమర్శించారు. ఫామ్ హౌస్‌ నుంచి బయటకు వస్తే నిజాలు తెలుస్తాయన్నారు. 
 
ఆమె శుక్రవారం కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలని డిమాండ్ చేశారు. ఆయుష్మన్ భారత్ అమలు చేస్తే లాభం లేదన్నారు. కేసీఆర్ మాత్రం యశోద ఆస్పత్రికి వెళ్తారు.. పేదవారు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలా అని ప్రశ్నించారు. 
 
'మీకో న్యాయం పేద వారికి ఓ న్యాయమా' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లెళ్ల కన్నీళ్లకు విలువ లేదా అని నిలదీశారు. కోవిడ్‌తో చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 
 
పేద వాళ్ల కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారని... కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించాలని  పేదల కోసం ఒక్క నాయకుడు కూడా ఆలోచించలేదని... తన తండ్రిది పెద్ద మనసని... కుటుంబాలని నిలబెట్టిన పథకం ఆరోగ్యశ్రీ అని చెప్పుకొచ్చారు. అలాంటిది తెలంగాణలో ఆరోగ్యశ్రీ అందడం లేదని వైఎస్ షర్మిల తెలిపారు.