తెలంగాణలో పరువు హత్య.. ప్రేమించాడని దాడి.. యువకుడి మృతి

సెల్వి| Last Updated: బుధవారం, 2 డిశెంబరు 2020 (21:51 IST)
తెలంగాణలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌలు పూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తమ తరపు అమ్మాయిని ప్రేమించాడని ఆమె తరపు కుటుంబ సభ్యులు మహేష్ అనే వ్యక్తి పై దాడి చేశారు. దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 25 రోజుల క్రితం దాడి చేయగా హైదరాబాద్‌లో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

ఇరవై ఐదు రోజుల క్రితం దాడిచేయగా ప్రథమ చికిత్స చేయించారు. గత కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. రక్తం గడ్డకట్టడం వల్ల మరణించినట్లు వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు దాడి చేయడం వల్ల మహేష్ కు రక్తం గడ్డ కట్టి మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. అమ్మాయి తరపు బంధువులు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీనిపై మరింత చదవండి :