1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 17 మార్చి 2023 (18:15 IST)

ఓట్ల లెక్కింపు పూర్తి: TS MLC ఎన్నికలో బీజేపీ గెలుపు

charminar
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును నమోదు చేసుకుంది. హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం ఐదు గంటలకు తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ 50 శాతానికి మించి రాలేదు. 
 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించారు. పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిపై గెలిచారు. 
 
మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర విషయాలు గుర్తించారు. టీచర్లకు సరిగా ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.