మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (12:20 IST)

తెలంగాణలో మళ్లీ కరోనా భూతం... 54మందికి పాజిటివ్

corona visus
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఓ వైపు ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్‌ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 54 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రజల్లో మళ్లీ కరోనా భయం పట్టుకుంది. 
 
బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 54మందికి కరోనా సోకింది. వారిలో 40మంది హైదరాబాదుకు చెందిన వారే కావడం గమనార్హం. బుధవారం రాష్ట్రంలో 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 54 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే రాష్ట్రంలో చాలా మంది ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్‌ వేరియంట్.. 'హెచ్‌3ఎన్‌2 కారణంగా ఆసుపత్రుల పాలవుతున్నారు.