వరంగల్‌లో అల్టిగ్రీన్ మొట్టమొదటి రిటైల్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ప్రారంభం
భారతదేశంలో సుప్రసిద్ధ వాణిజ్య విద్యుత్ వాహన తయారీదారు అల్టిగ్రీన్ నేడు తమ బ్రాండ్ నూతన రిటైల్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని తెలంగాణాలోని వరంగల్‌లో ప్రారంభించింది. ఇది భారతదేశంలో కంపెనీకి 24వ డీలర్‌షిప్. గతంలో ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు లాంటి ప్రధానమైన మెట్రో నగరాలలో తమ డీలర్‌షిప్‌లను విజయవంతంగా ప్రారంభించింది.
ఇతర నగరాలలో అల్టిగ్రీన్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాల్లాగానే, వరంగల్‌లోని ఈ నూతన డీలర్‌షిప్ ఈవీ ప్రియులకు అల్టిగ్రీన్ విస్తృతశ్రేణి విద్యుత్ కార్గో వాహనాలను పొందే అవకాశం అందిస్తుంది. హైదరాబాద్‌లో తమ బంధాన్ని మరింతగా విస్తరిస్తూ, అల్టిగ్రీన్ ఇప్పుడు తెలంగాణాలో ఆటోమోటివ్ పరంగా అత్యున్నత సంస్ధ రామ్ ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం విస్తరించింది. అల్టిగ్రీన్ రిటైల్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రంను దాస్యం వినయ్ భాస్కర్ గారు (ప్రభుత్వ చీఫ్ విప్, ఎంఎల్‌ఏ, వరంగల్ వెస్ట్) ప్రారంభించారు.
ఈ డీలర్‌షిప్ ప్రారంభంతో వినియోగదారులకు మెరుగైన, గతంలో ఎన్నడూ చూడని అనుభవాలను ప్రపంచశ్రేణి,ఆధునిక మౌలిక సదుపాయాలతో అల్టిగ్రీన్ అందించనుంది. అల్టిగ్రీన్ ఫౌండర్- సీఈఓ డాక్టర్ అమితాబ్ శరణ్ మాట్లాడుతూ, తెలంగాణాలో రామ్ ఎలక్ట్రిక్‌తో మా భాగస్వామ్యం మరింత దృఢంగా చేసుకునే అవకాశం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఆటోమొబైల్ వ్యాపారంలో రామ్ ఎలక్ట్రిక్‌కు దశాబ్దాల అనుభవం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఈవీ విస్తరణను మరింత వేగవంతం చేయడంలో ఇది తోడ్పడుతుంది. భారతీయ కార్గో, ప్యాసెంజర్ మొబిలిటీ అవసరాల కోసం అత్యుత్తమ ఈవీలను అందించడాన్ని అల్టిగ్రీన్ కొనసాగించనుంది అని అన్నారు.
రామ్ ఎలక్ట్రిక్ యజమాని శ్రీ అమిత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ వాహన పర్యావరణ వ్యవస్థను వేగవంతం చేయాలనే ప్రభుత్వ కార్యక్రమాలకు తోడ్పాటునందించడం పట్ల సంతోషంగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఈవీ- ఇంధననిల్వ విధానం రాష్ట్రంలో ఈవీ కంపెనీల కోసం స్నేహపూర్వక వాతావరణం సృష్టించనుంది. అల్టిగ్రీన్‌తో వరంగల్‌లో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల ఆనందంగా ఉన్నాము. కార్బన్ రహిత రవాణాను వేగవంతం చేయాలనే లక్ష్యంకు మద్దతు అందించనున్నాము అని అన్నారు.