ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: మంగళవారం, 29 జూన్ 2021 (16:34 IST)

అన్న జగన్‌తో తాడేపేడో తేల్చుకునేందుకు చెల్లెలు షర్మిళ రెడీ

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు. అసలు ఒక కుటుంబంలోని వారు రాజకీయాల్లో ఉంటే, అదికూడా వారు వేర్వేరు పార్టీల్లో ఉంటే మాత్రం ఇక రోజూ మాటల యుద్ధాలే. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఎపి రాజకీయాల్లో జరుగుతోంది. సొంతంగా తెలంగాణాలో పార్టీ పెట్టిన షర్మిళ అన్నతో ఢీకొంటోంది.
 
గత కొన్నిరోజులుగా తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరుగుతోంది. తెలంగాణా మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ఎపి సిఎంపై తీవ్ర విమర్సలు చేస్తున్నారు. ఇష్టానుసారం మాటల దాడికి దిగుతున్నారు. అయితే గత వారంరోజుల నుంచి ఎంత మాట్లాడుతున్నా సిఎం మాత్రం స్పందించడం లేదు.. ఖండించడం లేదు.
 
తాజాగా జగన్ చెల్లెలు షర్మిళ స్పందించారు. తెలంగాణాకు రావాల్సిన ఒకే ఒక్క నీటి బొట్టును కూడా వదిలేది లేదంటూ తేల్చిచెప్పారు. అవసరమైతే ఎవరితోనైనా పోరాటానికి సిద్ధమన్నారు. నీటి సమస్యకు ప్రధాన కారణం ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి. ఇక పోరాటం చేయాల్సింది ఆయనతోనే.
 
తాజాగా షర్మిళ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను హాట్ టాపిక్‌గా మారుతోంది. రాజన్న రాజ్యాన్ని తెలంగాణాలో సాధిస్తామని.. తెలంగాణా ప్రజలు తమవైపు ఉన్నారని చెబుతున్న షర్మిళ జల వివాదంలో ఎపి సిఎం, సొంత అన్నతో ఏ విధంగా పోరాటం చేస్తారన్నది మరింత ఆసక్తికరంగా మారుతోంది.