ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (14:29 IST)

వృద్ధురాలైన అత్తను చీపురుతో కొట్టిన కోడలు- వీడియో వైరల్

Mother in law
Mother in law
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వృద్ధురాలు స్త్రీ లక్ష్మమ్మ. ఈమెకు పద్మ పెద్ద కోడలు. అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా అత్తాకోడళ్ల మధ్య బుధవారం కూడా గొడవ జరిగింది. అయితే ఈ గొడవ దాడికి దారి తీసింది. 
 
వృద్ధురాలైన అత్తపై కోడలు దాడి చేసింది. చీపురుతో వృద్ధురాలిపై దాడి చేసింది. ఈ ఘటనను పక్కింటి వ్యక్తి వీడియో తీసి లక్ష్మమ్మ చిన్న కొడుకును పంపారు. అతను అంగుళ్ళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 
 
ఫిర్యాదును స్వీకరించిన పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.