బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:04 IST)

పెళ్లింట విషాదం.. డాన్స్ చేస్తుండగానే వరుడు మృతి..!

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బరాత్‌ ముగిశాక గుండెపోటుతో వరుడు గణేశ్‌(25) మృతి చెందాడు.

వివాహం అనంతరం జరిగిన బరాత్ ఉత్సాహంగా సాగింది. చివర్లో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె.. కూడా డ్యాన్స్ చేశారు. అందరూ ఆనందోత్సాల మధ్య ఉన్న సమయంలో.. ఒక్కసారిగా వరుడు గుండెపోటుతో కుప్పకూలిపోయి.

కాసేపటికే చనిపోయాడు. అప్పటివరకు సందడిగా ఉన్న పెళ్లి మండపంలో విషాదం నెలకొంది.