గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: మంగళవారం, 24 డిశెంబరు 2019 (17:37 IST)

స్కూటీని ఢీకొట్టిన రెడీ మిక్స్ లారీ, అక్క-తమ్ముడు మృతి

సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం బస్ స్టాప్ వద్ద స్కూటీని రెడీ మిక్స్ కాంక్రెట్ లారీ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై వెళ్తున్న వారిని కలచివేసింది. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన సుష్మాలత, సాయి తేజ.. 
అనే( అక్కా,తమ్ముడు ) మీ సేవకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
 
తమ పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, పుట్టిన ఇద్దరు పిల్లలు చనిపోవడంతో బోరున విలపించారు. అమీన్‌పూర్ వాసులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 
 
ఢీకొట్టి పారిపోతున్న రెడీ మిక్స్ లారీ డ్రైవరుని పట్టుకొని పోలీస్ స్టేషనుకి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలం నుండి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా మృతుల డెడ్ బాడీలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి తరలించారు పోలీసులు.