ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 3 సెప్టెంబరు 2020 (22:03 IST)

తెలంగాణ తొలి స్పీకర్‌పై అభిమానం ఇలా కూడా ఉంటుందా?

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో ఏడెలి మల్లారెడ్డి అనే ఓ రైతు తెలంగాణ ఉద్యమం నుండి సిరికొండ మధుసూదనాచారి అనుచరుడుగా ఉంటూ టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూపాలపల్లి నియోజకవర్గం నుండి గెలిచిన సిరికొండ మధుసూదనాచారిని శాసనసభాపతి పదవి కట్టబెట్టారు సీఎం కేసీఆర్. ఆ నియోజకవర్గంలో మధుసూదనాచారి అభిమానులందరూ మదన్న అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే మల్లారెడ్డి మాత్రం మదన్న మీద ఉన్న అభిమానంతో తన ఇంట్లో పెంచుకునే కోడిపుంజుకు మదన్న అని పేరు పెట్టు కున్నాడు.
 
మల్లారెడ్డి దగ్గిర సుమారుగా 40 కోళ్లు ఉన్నాయి. సిరికొండ మదన్న వస్తున్నాడు ఓహో.. అని మల్లారెడ్డి పిలవగానే కోళ్లు అన్నీ మల్లారెడ్డి వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అంతా ఈ వింతను చూసి ఇదేం అభిమానం రా బాబూ అనుకుంటున్నారు.