శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (09:17 IST)

ఓఆర్ఆర్‌లో బోల్తాపడిన థమ్స్‌అప్ లారీ... బాటిళ్ల కోసం ఎగబడిన జనం

road accident
హైదరాబాద్ నగరంలోని ఓటర్ రింగ్ రోడ్డులో థమ్స్‌అప్ బాటిళ్లలోడుతో వెళుతున్న లారీ ఒకటి బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ బాటిళ్ల కోసం పరుగులు తీశారు. 
 
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం, తారమతిపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. థమ్స్‌అప్ బాటిళ్ల లోడుతో వెళుతున్నలారీ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వాసులు ఘటనా స్థలానికి చేరుకుని థమ్స్‌అప్ బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవల్, క్లీనర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. 
 
మరోవైపు, ఆ మార్గంలో ప్రయాణిస్తున్నవారు కూడా తమ వాహనాలను ఆపి రోడ్డుపై పడిన థమ్స్‌అప్ బాటిళఅలను ఎత్తుకెళ్ళారే గానీ, గాయాలతో బాధపడుతున్న క్లీనర్, డ్రైవర్‌లను ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే, ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ే