సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (14:45 IST)

నల్గొండ జిల్లాలో లారీ దగ్ధం.. ఏమైంది?

 burn
నల్గొండ జిల్లాలో ఓ లారీ దగ్ధమైంది. రసాయన పరిశ్రమకు ముడిసరుకుతో రాజస్థాన్ నుంచి తడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ దామరచర్ల వద్ద లారీలో షార్ట్‌సర్య్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
 
అయితే డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. 
 
జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం జరిగడంతో దామరచర్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ప్రమాదానికి గురైన లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.