శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (17:37 IST)

ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు: జూన్ 10వరకు అప్లై చేసుకోవచ్చు..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నారు. ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లోనూ పరీక్షలు వాయిదా పడ్డాయి.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమలో పలు పరీక్షలు వాయిదా పడుతున్నాయి. మరికొన్నింటిని రద్దు చేస్తున్నారు. పలు పరీక్షల దరఖాస్తు గడువును సైతం అధికారులు పొడిగిస్తున్నారు. 
 
అందులో భాగంగానే ఎంసెట్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా మరోసారి పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 10 వరకు అప్లై చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.

జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు eamcet.tsche.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.