ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

రేపటితో ముగియనున్న గ్రూపు-1 దరఖాస్తు గడువు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూపు-1 దరఖాస్తు గడువు తేదీ శనివారంతో ముగియనుంది. గ్రూపు-1లో ఖాళీగావున్న పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీచేశారు. ఈ పోస్టులకు అనేక మంది నిరుద్యోగ అభ్యర్థుల విపరీతంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. పైగా, నిరుద్యోగ అభ్యర్థుల వినతి మేరకు మే 31 తేదీతో ముగిసిన దరఖాస్తు గడువును జూన్ 4వ తేదీ వరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడగించింది. 
 
కాగా, గ్రూపు-1 పోస్టుల కోసం ఇప్పటివరకు 3,58,237 దరఖాస్తులు వచ్చాయి. అలాగే, 1,88,137 మంది అభ్యర్థులు ఓటీర్ అప్‌డేట్ చేసుకున్నారు. ఓటీఆర్ ఎడిట్ చేసుకున్న వారి సంఖ్య 3,79,851గా వుంది. దరఖాస్తు నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుడా టీఎస్ పీఎస్సీ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న విషయం తెల్సిందే.